
Punjab: 'రిపబ్లిక్ డే' రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్
ఈ వార్తాకథనం ఏంటి
సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మంగళవారం కీలక ప్రకటన చేశాడు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డీజీపీ గౌరవ్ యాదవ్‌లను జనవరి 26న రిపబ్లికే డే రోజును చంపేస్తామని బెదిరించాడు.
జనవరి 26 నాడు మాన్‌ను హత్య చేసేందుకు గ్యాంగ్‌స్టర్‌లను కలిసి రావాలని పన్నూన్ కోరాడు.
పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బెదిరింపులకు కారణంగా తెలుస్తోంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై పన్నూన్ అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు.
బాబ్రీ మసీదుపై నిర్మించిన ఆలయ వేడుకను వ్యతిరేకించాలని ముస్లిం సమాజాన్ని రెచ్చేగొట్టేలా ప్రకటన చేశాడు.
ఈ ప్రకటన చేసిన వారం రోజుల తర్వాత ఇప్పుడు పంజాబ్ సీఎంను చంపేస్తామని బెదిరించడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పన్నూన్ హెచ్చరిక
पंजाब CM भगवंत मान को मिली जान से मारने की धमकी
— Yogendra Singh (@YogiSM4Bharat) January 16, 2024
◆ SFJ आतंकवादी पन्नू ने जान से मारने की दी धमकी #BhagwantMann | #Punjab | Punjab ` pic.twitter.com/ZpRXTmNroC