
చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.
అలాగే తమ సభ్యులు ఆగస్టు 15న చండీగఢ్ వైపు కవాతు చేస్తారని ప్రకటించింది.
జైలు శిక్ష పూర్తయిన సిక్కు ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్ మేరకు తాము ఈ ర్యాలీ చేయనున్నట్లు కిమ్ గ్రూప్ వెల్లడించింది.
దీంతో చండీగఢ్, మొహాలీ పోలీసులు సరిహద్దులో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
దీంతో చండీగఢ్-మొహాలీ మార్గంలో వాహనాల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి.
పంజాబ్‌లో 1990లో చెలరేగిన హింసలో అరెస్టైన సిక్కు ఖైదీలు మూడు దశాబ్దాలకు పైగా జైళ్లలో మగ్గుతున్నారు. దీంతో శిక్ష పూర్తయిన వారిని విడుదల చేయాలని కిమ్ డిమాండ్ చేస్తోంది.
ఖలిస్థాన్
ఆప్ ప్రభుత్వంపై 'కిమ్' ఒత్తడి
2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తర్వాత, సిక్కు ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.
సిక్కు ఖైదీలను విడుదల చేయడంలో విఫలమైనందుకు ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు మంగళవారం నిరసనకారులు నలుపు, కుంకుమ జెండాలతో కవాతు చేస్తారని కిమ్ సభ్యులు తెలిపారు.
సాధారణ జీవిత ఖైదు 14ఏళ్లు పూర్తి చేసిన 9మంది ఖైదీలను విడుదల చేయాలని కిమ్ డిమాండ్ చేస్తోంది.
ఈ ఖైదీలలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో దోషి అయిన బల్వంత్ సింగ్ రాజోనా, 1993 దిల్లీ బాంబు పేలుళ్ల కేసులో దోషి దేవిందపాల్ సింగ్ భుల్లర్ ఉన్నారు.