LOADING...
'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు
'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు

'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు

వ్రాసిన వారు Stalin
Sep 20, 2023
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్- కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది. భారతదేశం-కెనడా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) బుధవారం కీలక సూచనలు చేసింది. కెనడాలో నివసిస్తున్న, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయ పౌరుల కోసం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలు, ఇండియా అనుకూల విభాగాలు బెదిరింపులను ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు తన అడ్వైజరీ లేఖలో ఎంఈఏ పేర్కొంది.

ఎంఈఏ

హైకమిషన్, కాన్సులేట్లలో పేరును నమోదు చేసుకోవాలి: ఎంఈఓ 

భారతీయ పౌరులు కెనడాలోని ఇతర ప్రాంతాలకు వీలైనంత వరకు ప్రయాణించకుండా ఉండాలని సూచించింది. భారతీయ పౌరులు కెనడాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా, కౌన్సెల్స్ జనరల్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని ఎంఈఓ కోరింది. కెనడాలోని భారతీయులు, విద్యార్థులు తప్పనిసరిగా ఒట్టావాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా, టొరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకోవాలని ఈఎంఓ అడ్వైజరీ లేఖలో పేర్కొంది. ఏదైనా అత్యవసర లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కెనడాలోని భారతీయ పౌరులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి ఈ సమాచారం ద్వారా కాన్సులేట్ జనరల్ సహాయపడుతుందని వివరించింది.