
స్కాట్లాండ్ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత రాయబారిని అడ్డుకున్న సిక్కు రాడికల్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలిస్థానీ అనూకూల, సిక్కు రాడికల్స్ శక్తుల కార్యకలాపాలు కూడా పెరిగాయి.
తాజాగా యూకే భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి శుక్రవారం స్కాట్లాండ్‌లోని గురుద్వారాకు వెళ్లగా, ఆయన్ను లోపలికి వెళ్లకుండా సిక్కు రాడికల్స్ అడ్డుకున్నారు. దొరైస్వామికి అనుమతి లేదని తేల్చి చెప్పారు.
ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా వెలుపల ఈ సంఘటన జరిగింది.
భారతీయ దౌత్యవేత్తను గురుద్వారాలోకి రాకుండా అడ్డుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఖలిస్థానీ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ.. దొరైస్వామి గురుద్వారా కమిటీతో సమావేశమవడానికి వచ్చినట్లు తమకు తెలిసిందన్నారు. అందుకే అడ్డుకున్నట్లు చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాయబారిని అడ్డుకుంటున్న దృశ్యం
A group of #Khalistani Sikh in the UK prevented the Indian High Commissioner, Vikram Doraiswami, from entering a Gurdwara in #Scotland. pic.twitter.com/EHEFQsOZO5
— Truth Reporting (@truth_reporting) September 30, 2023