Page Loader
Pannun : పన్నూన్‌ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు
Pannun : పన్నూన్‌ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు

Pannun : పన్నూన్‌ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 30, 2023
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద కసు నమోదైంది. పన్నూన్‌'ను హత్య చేసేందుకు ఈ ఏడాది మే నెలలో అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారితో లక్ష డాలర్లు ఒప్పందం జరిగిందని, న్యూయార్క్‌ కోర్టులో ఆరోపణలు నమోదయ్యాయి. ఈ మేరకు ఫెడరల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆరోపణల మేరకు అమెరికా న్యాయ విభాగం భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్‌ గుప్తా (52)పై కేసు నమోదు చేసింది. కేసులో నేరం రుజువై దోషిగా తేలితే నిఖిల్‌ గుప్తాకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని న్యూయార్క్‌ జిల్లా యూఎస్‌ అటార్నీ మాథ్యూ జీ ఓల్సెన్‌ హెచ్చరికలు జారీ చేశారు.

details

భారతదేశం చేరిన అమెరికా నిఘా అధికారులు

మరోవైపు ఇదే కేసులో నిందితుడు నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు 2023 జూన్‌ 30న అరెస్ట్ చేశారు. అయితే అమెరికాకు అప్పగించారా, లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. కేసు విచారణ నిమిత్తం ఇద్దరు అమెరికా నిఘా అధికారులు భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలపై విచారించేందుకు, అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని భారత్ సర్కార్ ప్రకటించింది. అమెరికాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ అంశంపై చర్చించామని, అన్ని కోణాల్లో పరిశీలించేందుకు నవంబర్‌ 18న ఉన్నతస్థాయి కమిటీని నియమించామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పారు. దీని ఆధారంగా భారత్‌ చర్యలు చేపడుతుందన్నారు. భారత్‌ చర్యలకు అమెరికా ఆందోళన వ్యక్తం చెందుతుతోందని,ఈ మేరకు భారత్‌ను వివరణ కోరినట్లు తెలుస్తోంది.