
కెనడా దసరా సంబురాల్లో ఖలిస్థానీల కుట్ర.. అంతరాయం కలిగించేందుకు పన్నాగం
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో దసరా సంబురాలను అడ్డుకునేందుకు ఖలిస్థానీ అనుకూల మద్దతుదారులు కుట్రకు యత్నించారు.
భారతదేశానికి చెందిన ప్రముఖ భారతీయ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా పెద్ద ఎత్తున నిరసన చేసేందుకు పన్నాగం పన్నారు.
ఈ మేరకు హిందువులు, భారతీయులపై పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు ఒడిగట్టారని సమాచారం.
అక్టోబర్ 24, మంగళవారం కెనడాలోని సర్రేలో హిందూ సమాజం నిర్వహిస్తున్న విజయదశమి వేడుకల్లో ఖలిస్థానీ గ్రూపులు పెద్ద ఎత్తున అవాంతరాలను ప్లాన్ చేస్తున్నాయి.
అయితే ఖలిస్తాన్‌కు మద్దతు ఇచ్చే వ్యక్తులు, సమూహాలు వేదికపైకి హిందువుల ప్రవేశాన్ని ఆపేందుకు భారీ వాహనాలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
details
అక్టోబర్ 28న జరగనున్న ఓటింగ్
ఓవైపు భారతీయులు దసరా సంబురాల్లో నిమగ్నం కాగా మరోవైపు ఖలీస్థానీలు ప్రముఖ భారత నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈఅంశంపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చర్య తీసుకునేందుకు సిద్ధంగా లేరని స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కారణమా కాదా అనే అంశంపై అక్టోబర్ 28న ఓటింగ్ జరగనుంది.
ఈ క్రమంలోనే వాంకోవర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం కెనడియన్ సిక్కులు తరలిరావాలని ఖలిస్తానీ సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్(SFJ) చీఫ్ కోరారు.
భారత హిందూవులకు, సిక్కుల మధ్య కొనసాగుతున్నఉద్రిక్తత అని తెలుస్తోంది. అక్టోబరు 28న జరిగే ఈ ఉత్సవాలకు సర్రే ప్రాంతంలో నిరసనకారులు ఇప్పటికే గుమిగూడారు.