నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు
ఖలిస్థానీ తీవ్రవాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన భారత్- కెనడాల మధ్య అగ్గి రాజేసింది. ఈ మేరకు హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని సాక్షాత్తు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటన అంతర్జాతీయంగా అలజడి సృష్టించింది. బుధవారం కొత్త పార్లమెంటులో విదేశాంగశాఖ, జాతీయ భద్రతా అధికారులు భేటీ అయ్యారు.ఈ మేరకు కెనడా, ఆధారాలను చూపించాలన్నారు. ఇండియన్ ఏజెన్సీలపై సాక్ష్యాధారాలుంటే, కెనడా దర్యాప్తునకు సహకరిస్తామని, ఇందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. నిజ్జర్ హత్య భారత ఏజెంట్ల పనేనని, అనేందుకు ఆధారాలు చూపించాలని కెనడా ప్రతిపక్ష నేత పియర్ పోయిలీవ్రే కోరారు. మరోవైపు కాంగ్రెస్ సైతం కెనడా తీరును తప్పబట్టింది.ఆధారాలుంటే ఈపాటికే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి ఉండేవాారని శశిథరూర్ అన్నారు.