ఇండో హిందూలకు సిఖ్ ఫర్ జస్టిస్ అల్టిమేటం.. దేశం విడిచి భారత్ వెళ్లిపోవాలని హెచ్చరికలు
కెనడాలో ఖలిస్థాన్ అనుకూలవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) అల్టిమేటం ఆ దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. హిందువులు వెంటనే భారతదేశం తిరిగి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఖలిస్థాన్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై సంబురాలు చేసుకునేందుకు భారత సంతతి హిందువులు కెనడాను వీడాలని ప్రకటన చేశారు. ఖలిస్థాన్ అణచివేతకు మీరు భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న కారణంగా, ఇండో-హిందూలారా కెనడాను వదిలి వెళ్లిపోండని SFJ లీగల్ కౌన్సిల్ గుర్ పట్వంత్ పన్నమ్ తేల్చిచెప్పారు. కెనడియన్ హిందూస్ ఫర్ హార్మనీ సంస్థ ఈ హెచ్చరికలపై ఆందోళన వ్యక్తం చేసింది.మరోవైపు 2019 లోనే కేంద్రం ఈ సంస్థను నిషేధించింది. ఈ మేరకు పన్నమ్ ను టెర్రరిస్టుగా ప్రకటించింది.