LOADING...
ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్ 
ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్ ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్

ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 16, 2023
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, కెనడా మధ్య వ్యాపార వాణిజ్య చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఖలిస్థానీ వివాదంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన మనస్ఫర్థలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)పై చర్చలు వాయిదా పడ్డాయి. రాజకీయ విభేదాలు పరిష్కారం తర్వాతే చర్చలను పునఃప్రారంభిస్తామని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. కెనడాలోని ఖలీస్థానీ ఆగడాలపై భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సమావేశాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారత సీనియర్‌ అధికారి తెలిపారు. భారత్‌ నుంచి పంజాబ్‌ను వేరుచేయాలని కెనడాలో ఖలిస్తానీ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. వారి మద్దతు దార్లపై కెనడా సర్కార్ మెతకగా వ్యవహరిస్తోందని భారత్ వాదిస్తోంది.

DETAILS

కెనడా కంటే భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు 

భావ ప్రకటన స్వేచ్ఛ తమ దేశ విధానమని, దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎందుకన్నట్లు కెనడా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. G-20 వేళ ట్రూడో, మోదీ భేటీలో ఇరుపక్షాలూ పరస్పరం ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్లు కేంద్ర వాణిజ్య శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ ధ్రువీకరించారు. G-20 సదస్సుకు ముందే చర్చలను వాయిదా వేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. దీంతో రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లకు కెనడా దూరమైందన్న విషయం స్పష్టమైంది. కెనడా జనాభా 4 కోట్ల కాగా భారత జనాభా 140 కోట్లు. కెనడా కంటే భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం.