Page Loader
India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్‌ కామెంట్స్ 
India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్‌ కామెంట్స్

India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్‌ కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజ్జర్‌ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య తలెత్తిన పరిస్థితులు, ఆ నాటి పరిస్థితులను భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఓ కార్యక్రమంలో వివరించారు. ఆ సమయంలో కెనడాలోని భారత దౌత్యాధికారులకు వరుస బెదిరింపులొచ్చినట్లు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. దౌత్య అధికారులకు బెదిరింపులు వచ్చినా.. ఆ దేశ వ్యవస్థల నుంచి వారికి సహకారం అందలేదని ఆరోపించారు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల వల్లే గతేడాది కెనడాలో వీసా జారీ సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు.

జైశంకర్

వారిని అరెస్టు చేయాలి: జైశంకర్

లండన్‌లోని భారత హైకమిషన్‌పై, శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌పై దాడులకు పాల్పడిన నిందితులతో పాటు కెనడాలోని ఇండియా దౌత్యవేత్తలను బెదిరించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని జైశంకర్ డిమాండ్ చేశారు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదులకు భారత దౌత్య కార్యాలయాలపై దాడులు చేసేంత స్వేచ్ఛ లభించడంపై జైశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాల దౌత్యవేత్తలను బెదిరించే స్థాయికి వారికి స్వేచ్ఛ విస్తరించడం అంత మంచిది కాదన్నారు. అలాగే, యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియాలోనూ ఇలాంటి దాడులే జరిగినట్లు జైశంకర్ గుర్తు చేశారు. అయితే అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయన్నారు.