Page Loader
అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే!
అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే!

అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే!

వ్రాసిన వారు Stalin
Apr 24, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోవడంలో ఎందుకు జాప్యం చేశారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మార్చి 18నే అతన్ని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలపై సీఎం భగవంత్ మాన్‌ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. మార్చి 18న అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసి ఉంటే, అప్పుడు ఎన్నోబుల్లెట్లు పెల్చాల్సి వచ్చేదని, తాము అలా చేయాలనుకోలేదని మాన్ చెప్పారు. అజ్నాలా హింస సమయంలో కూడా అమృత్‌పాల్, అతని మద్దతుదారులను తాము ఏదైనా చేయగలమన్నారు. కానీ పంజాబ్ ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా తాను ఏమీ చేయదలచుకోలేదన్నారు. ఇంత సంయమనం పాటించినందుకు పోలీసులను తాను అభినందిస్తున్నట్లు మాన్ పేర్కొన్నారు.

పంజాబ్

పంజాబ్ భూమి సారవంతమైనది, ఇక్కడ ద్వేషం విత్తనాలు ఎప్పటికీ పెరగవు: మాన్

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆపరేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శులు గుపిస్తోంది. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ దాన్ని ఓ డ్రామాగా అభివర్ణించారు. అమృత్‌పాల్ అరెస్టు విషయంలో ఆప్ ప్రభుత్వం సిక్కు సమాజం పరువు తీసిందని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా ఆరోపించారు. ఆపరేషన్ గురించి తాను శనివారం రాత్రంతా సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపానని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మన్ తెలిపారు. పోలీసులకు సహకరించిన పంజాబ్ ప్రజలకు మన్ కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్ భూమి సారవంతమైనదని, ఇక్కడ ఏదైనా పెరగవచ్చని, కానీ ద్వేషం విత్తనాలు ఎప్పటికీ పెరగవని మాన్ చెప్పారు.