Page Loader
భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత
భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత

భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత

వ్రాసిన వారు Stalin
Jul 09, 2023
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్థానీ మద్దతుదారులు చేపట్టిన 'ఖలిస్థాన్ ఫ్రీడమ్ ర్యాలీ' ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో హింస చెలరేగడంతో ఇద్దరు ఖలిస్థానీ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఖలిస్థాన్ మద్దతుదారులు భారత కాన్సులేట్ వెలుపల వద్ద నిరసనకు దిగారు. అనంతరం ప్రవాస భారతీయులు ఇండియాకు అనుకూల నినాదాలతో మరోవైపు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు బారికేడ్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఖలిస్తానీ అనుకూల నిరసనకారులు పట్టుబడ్డారు. అయితే వారికి ఎలాంటి జరిమానా విధించకుండా విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. సిక్కు వేర్పాటువాద గ్రూపు సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) ఆధ్వర్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ ర్యాలీ నిర్వహించారు.

ఖలిస్థానీ

భారత కాన్సులేట్ వెలుపల పోటాపోటీగా ప్రద్శనలు

టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్థాన్ నిరసనకారులు నిజ్జర్ పోస్టర్లను కూడా ప్రదర్శించారు. అతని హత్య వెనుక భారతదేశ హస్తం ఉందని ప్లకార్డును ప్రదర్శించారు. కొంతమంది ప్రదర్శనకారులు "రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్థాన్" అని ఉన్న జాకెట్లను కూడా ధరించారు. భారత అనుకూల ప్రదర్శనకారులు త్రివర్ణ పతాకాలు, పోస్టర్లను పట్టుకుని వీధుల్లో ఖలిస్థాన్ నిరసనకారులకు ధీటుగా నినాదాలు చేశారు. ఇటీవల కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ నాయకుడు హర్జీత్ సింగ్ నిజ్జార్ గుర్తుగా ఈ ప్రదర్శన చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు కెనడాలోనే కాకుండా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా కూడా నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత కాన్సులేట్ ఎదుట ఇరు వర్గాల నిరసనలు