బలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు?
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశాన్ని కెనడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌పై నేరుగా ఆరోపణలు చేస్తోంది.
మరి నిజ్జర్ హత్యపై ఇంతలా పరితపిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అదే దేశ పౌరురాలు బలూచ్ మానవ హక్కుల కార్యకర్త కరీమా బలోచ్ అనుమానాస్పద మరణంపై ఎందుకు మౌనంగా ఉన్నారని బలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (బీహెచ్‌ఆర్‌సీ) ప్రశ్నించింది.
ఈ మేరకు జస్టిన్ ట్రూడోకు ఆ సంస్థ లేఖ రాసింది. ట్రూడో రాజకీయాలు చేస్తున్నారని ఆ లేఖలో విమర్శించింది. ప్రభుత్వ స్పందనలో అసమానతలు ఉన్నాయని బీహెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది.
2020లో కరీమా కిడ్నాప్‌కు గురై, ఆ తర్వాత శవమై కనిపించింది. కెనడా ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది.
కెనడా
కరీమా బలోచ్ ఎవరు?
బలూచిస్థాన్ హక్కుల కార్యకర్త. పాకిస్థాన్ ప్రభుత్వంతో బలూచిస్థాన్ ప్రజల హక్కుల కోసం కరీమా బలూచ్ పోరాడారు.
అలాగే ఆమె రాజకీయ విద్యార్థుల సంస్థ అయిన బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మొదటి అధ్యక్షురాలుగా ఉన్నారు.
ఆమె పాకిస్థాన్ మిలిటరీ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ను తీవ్రంగా విమర్శించిన బలోచ్‌కు పాక్‌లో ముప్పు ఉండటంతో కెనడాలో ఆశ్రయం పొందారు.
2020లో ఆమె అన్యూహంగా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత స్వీడన్‌లోని ఒక నదిలో శవమై కనిపించారు.
బలూచిస్థాన్ హక్కుల నేతలు కరీమా మరణంలో కుట్ర కోణం ఉందని చెప్పారు.
కానీ కెనడా పోలీసులు మాత్రం ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఆమె హత్యపై విచారణ జరిపించాలని బీహెచ్‌ఆర్‌సీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది.