ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చివేస్తామని, జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను విడుదల చేయాలని, అలాగే రూ.500 కోట్లను ఆ మెయిల్‌లో డిమాండ్ చేశారు.
దీంతో అప్రమత్తమైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బెదిరింపు ఇమెయిల్ గురించి ముంబై పోలీసులను అప్రమత్తం చేసింది. వెంటనే గుజరాత్ పోలీసులతో పాటు ప్రధాని భద్రతకు సంబంధించిన వివిధ కేంద్ర ఏజెన్సీలకు సమాచారాన్ని అందజేసింది.
అయితే మెయిల్ ఎవరు పంపారనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని ఎన్ఐఏ తెలిపింది. మరోపక్క ముంబయి, గుజరాత్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
మోదీ
ఎస్ఎఫ్‌జే హస్తం ఉందా?
వాంఖడే స్టేడియం 5 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నందున ముంబై పోలీసులు భద్రతను పెంచినట్లు తెలిసింది.
ఈ మెయిల్ గురువారం వచ్చినట్లు ముంబై పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
గత వారం సిక్కుల ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) అనే ఉగ్రవాద సంస్థ కూడా ఇదే విధమైన బెదిరింపును జారీ చేసిన విషయం తెలిసిందే.
దీంతో కేంద్ర ఏజెన్సీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మెయిల్ ఎవరైనా ఆకతాయి పంపాడా? దీని వెనుక ఎస్ఎఫ్‌జే హస్త ఉందా? అని పోలీసులు నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు వారాల క్రితం కెనడాలో గ్యాంగ్‌స్టర్ సుఖా డునేకే హత్యకు బాధ్యత వహించిన తర్వాత ఎస్ఎఫ్‌జే హిట్ లిస్టులో బిష్ణోయ్ ఉన్నాడు.
మెయిల్ పంపినవారి ఐపీ అడ్రస్‌ను తెలుసుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.