Page Loader
అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక 
అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక

అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక 

వ్రాసిన వారు Stalin
Sep 24, 2023
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ఖలిస్థానీ మద్దతుదారులకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలోని సర్రేలో నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కెటిఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత, యూఎస్‌లో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారుల వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. అమెరికా నిఘా సంస్థల సేకరించిన సమాచారం ఆధారంగా ఈ హెచ్చరికను జారీ చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ చెప్పింది. అయితే ఎవరి నుంచి ముప్పు ఉందో ఎఫ్‌బీఐ వెల్లడించకపోవడం గమనార్హం. జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలిస్థానీ అనుకూల శక్తుల్లో ఆందోళన మొదలైంది.

అమెరికా

సిక్కు అమెరికన్లకు ఎఫ్‌బీఐ నుంచి కాల్స్ 

అమెరికన్ సిక్కు కాకస్ కమిటీ కోఆర్డినేటర్ ప్రీత్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య తర్వాత, తనకు, కాలిఫోర్నియాలోని మరో ఇద్దరు సిక్కు అమెరికన్లకు ఎఫ్‌బీఐ నుంచి కాల్స్ వచ్చాయని చెప్పారు. కాలిఫోర్నియాకు చెందిన ఎన్జీవో ఇన్సాఫ్ కో-డైరెక్టర్ సుఖ్‌మన్ ధామీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎఫ్‌బీఐ ఏజెంట్లు తనను కలిశారని చెప్పారు. బ్రిటిష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ఆఫ్ కెనడా ప్రతినిధి మోనీందర్ సింగ్ మాట్లాడుతూ.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ముందు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని కెనడా అధికారులు చెప్పారని, అయితే ఎవరి వల్లే ప్రమాదం ఉందో చెప్పలేదని వెల్లడించారు. నిజ్జర్ హత్యకు గురికాకముందే, కెనడా అధికారులు అతని ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరించారు.