Page Loader
'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం 
'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం

'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం 

వ్రాసిన వారు Stalin
Oct 03, 2023
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది. భారత్‌లోని 40 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవాలని కెనడాను భారత్ కోరినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. అక్టోబర్ 10వ తేదీ నాటికి కెనడా దౌత్య‌వేత్తలు దిల్లీని వదిలి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం గడువు విధించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో కెనడాకు చెందిన దౌత్యవేత్తలు 62 మంది ఉన్నారని, వీరిలో 41మంది తిరిగి పంపించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రాసుకొచ్చింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు అట్టగుడు స్థాయికి దిగజారుతాయని దౌత్య నిపుణలు చెబుతున్నారు.

కెనడా

అక్టోబర్ 10 తర్వాత ఉంటే భద్రత కల్పించం: భారత్

కెనడాలో భారత దౌత్యవేత్తలు ఉన్నదానికంటే, దిల్లీలో ఆ దేశ రాయబరులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. రాయబారుల సంఖ్య సమంగా ఉండాలని ఆయన అన్నారు. అక్టోబర్ 10 తర్వాత రాయబారుల సంఖ్యను తగ్గించుకోకుంటే, తాము మిగిలిన వారికి భద్రతను ఇవ్వలేమని భారత ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రాసుకొచ్చింది. ఈ అంశంపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే కెనడా విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించలేదు.

కెనడా

ట్రూడో ఆ సాహసం చేయరు: పీటర్ బోహ్మ్ 

అయితే నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కి తగ్గాలని ఆశించడం లేదని కెనడియన్ సెనేట్ కమిటీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చైర్ పీటర్ బోహ్మ్ పేర్కొనారు. అలాగని మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ట్రూడో దూకుడుగా వెళ్లే అవకాశం లేదని, ఆయనకు పరిమిత సామర్థ్యం ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయం భారత ప్రభుత్వానికి కూడా తెలుసునన్నారు. లిబరల్ పార్టీ నాయకుడైన ట్రూడో, ఎన్‌డీపీకి నాయకత్వం వహిస్తున్న కెనడియన్ సిక్కు నాయకుడు జగ్మీత్ సింగ్‌తో సంకీర్ణ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమలో భారత్‌తో అటు దూకుడుగా వెళ్లకుండా, అలాగని ఖలిస్థానీ అనుకూల సంస్థలను అసంతృప్తి పర్చకుండా ట్రూడో వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.