Page Loader
జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు
దిల్లీని ఖలీస్థానీ చేస్తామంటూ గోడ రాతలు

జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 27, 2023
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మెట్రో స్టేషన్లో గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీ వేదికగా త్వరలోనే G-20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోవడంపై నగరం ఉలిక్కి పడింది. ఆదివారం ఉదయం ఐదు మెట్రోస్టేషన్ల గోడలపై దిల్లీని ఖలిస్థానీ చేస్తామంటూ రాయడం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని దిల్లీ సీపీ హెచ్చరించారు. శివాజీ పార్క్ మెట్రో స్టేషన్‌ నుంచి పంజాబీ బాగ్ వరకు సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌(SFJ)పేరిట ఖలిస్థాన్‌కు మద్దతుగా గోడలపై రాతలు రాశారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులు గతంలో ఆలయాలపై, భారత రాయబార కార్యాలయాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల రాతలు