దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం రాజధాని దిల్లీ వేదికగా అమెరికా - చైనా విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గంలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే ఉన్నతాధికారి ఉజ్రా జియా తీరును చైనా తప్పుబట్టింది.
ఈ మేరకు జియా, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. ఈ క్రమంలోనే అమెరికా తీరుపై డ్రాగం దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది.
టిబెట్ చైనీస్ అంతర్గత అంశాల్లో యూఎస్ జోక్యం చేసుకోవడం ఆపాలని చైనా హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి వాంగ్ షియావ్ జియాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
షిజాంగ్ తమ దేశ అంతర్భాగమన్న సంగతిని అమెరికా గుర్తించి, దాని నిబద్ధతకు కట్టుబడి ఉండేలా యూఎస్ కృషి చేయాలని వాంగ్ సూచించారు.
details
జులై 8 నుంచి 14 వరకు భారత్, బంగ్లా పర్యటనలో ఉజ్రా జియా
దలైలామా బృందం చేపట్టనున్న చైనా వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వకూడదన్నారు.
షిజాంగ్ (టిబెట్ చైనీస్ ప్రాంతం) వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గతమైనవని, వీటిలో బయటి శక్తుల ప్రమేయానికి అర్హత లేదన్నారు.
టిబెట్ స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోరుకునే శక్తులు, విదేశీ దౌత్యవేత్తల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.
అయితే అమెరికా ఉన్నతాధికారి ఉజ్రా జియాకు టిబెట్ అఫైర్స్ కోఆర్డినేటర్ హోదా ఇవ్వడాన్ని చైనా ప్రతినిధులు ఖండించారు.
ఉజ్రా జియా జులై 8 నుంచి 14 వరకు ఆసియా పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె భారత ఉన్నతాధికారులనూ కలవనుండటం విశేషం.
జియా వెంట అమెరికా విదేశాంగ సహాయ మంత్రి డొనాల్డ్ తదితరులు ఉన్నారు.