
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన దుండగులు
ఈ వార్తాకథనం ఏంటి
కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు ఆదివారం తెల్లవారుజామున 1:30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం స్థానిక ఛానెల్ దియా టీవీ ధృవీకరించింది.
ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌పై జరిగిన రెండో దాడి ఇది. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఖలిస్థానీ అనుకూల శక్తులు మార్చిలో భారత కాన్సులేట్‌కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన వీడియోను దియా టీవీ ఛానెల్ షేర్ చేసింది.
ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది మంటలను త్వరగానే అదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు.
ఈ ఘటనను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్రంగా ఖండించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన దృశ్యాలు
ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm
— Diya TV - 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023