
కెనడాలో మరో హిందూ దైవాలయంపై ఖలిస్థానీల దాడి
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల శక్తులు మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
కెనడా-యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులోని ఫ్రేజర్ నదికి దక్షిణంగా ఉన్న సర్రే నగరంలోని పురాతన లక్ష్మీనరసింహ దేవాలయంలో వారు విధ్వంసం సృష్టించారు.
అనంతరం ప్రధాన ద్వారం వద్ద ఖలిస్థానీ పోస్టర్‌లను అతికించారు.
ఖలిస్థానీ మద్దతుదారులు జూన్ 18న జరిగిన ఖలిస్థానీ నేత హర్దీప్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై రిఫరెండం నిర్వహించబోతున్నట్లు ఆ పోస్టర్లలో రాసి ఉంది.
ఆ పోస్టర్‌లో నిజ్జర్ చిత్రం కూడా ఉంది. అతన్ని అందులో అమరవీరుడిగా అభివర్ణించారు.
ఇద్దరు ఖలిస్థాన్ మద్దతుదారులు ముసుగులు ధరించి ఆలయ ప్రవేశద్వారం వద్ద పోస్టర్లు అతికిస్తున్న వీడియోను 'ది ఆస్ట్రేలియా టుడే' ట్వీట్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆలయ ద్వారం వద్ద పోస్టర్లను అతికిస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులు
Another #Hindu temple vandalised in #Canada by Khalistan extremists, Khalistanreferendum posters put at door of @surreymandir @JustinTrudeau @AmitShah @PMOIndia pic.twitter.com/ITIT4cR9hl
— Kamlesh Kumar Ojha🇮🇳 (@Kamlesh_ojha1) August 13, 2023