Page Loader
ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు 
ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు

ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు 

వ్రాసిన వారు Stalin
Sep 27, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది. ఖలిస్థానీలు -గ్యాంగ్‌స్టర్‌ల బంధానికి సంబంధించి దేశవ్యాప్తంగా 6రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ భారీ దాడులు నిర్వహిస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న హవాలా ఆపరేటర్లు, గ్యాంగ్‌స్టర్ల లాజిస్టిక్ కోఆర్డినేటర్లను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌లో 30చోట్ల, రాజస్థాన్‌లో 13, హర్యానాలో 4, ఉత్తరాఖండ్‌లో 2, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక ప్రాంతం చొప్పున తనిఖీలు జరుగుతున్నాయి. యూకే, యూఎస్, కెనడా, దుబాయ్, పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాల్లో నివసిస్తున్న 19మంది పరారీ ఖలిస్థానీ ఉగ్రవాదుల జాబితాను ఎన్ఐఏ విడుదల చేసింది. వారి ఆస్థులను జప్తు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి.

ఖలిస్థానీ

ఆచూకీ చెప్తే రివార్డు ఇస్తాం: ఎన్ఐఏ

ఇప్పటికే నిషేధిత ఖలిస్థానీ అనుకూల గ్రూప్ సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే దేశం నుంచి పారిపోయిన 19మందిపై ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద చర్యలు తీసుకుంటామని ఎన్ఐఏ తెలిపింది. వీరు విదేశాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు పేర్కొంది. ఖలిస్థానీ టెర్రరిస్టు హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండా, లఖ్‌బీర్ సింగ్ సంధు అలియాస్ లాండాలపై ఎన్ఐఏ ఇప్పటికే రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. అలాగే, ఫిరోజ్‌పూర్‌కు చెందిన పర్మీందర్ సింగ్ కైరా, సత్నామ్ సింగ్, యద్వీందర్ సింగ్‌ ఆచూకీ చెప్తే రూ.5 లక్షల నగదు బహుమతిని ఇస్తామని ఎన్ఐఏ చెప్పింది.