Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్యకు కుట్ర.. విచారణ కమిటీని ఏర్పాటు చేసిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర పడిందని ఆమెరికా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ఇక అమెరికా పౌరుడిని హత్య చేసే కుట్రను ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై వైట్ హౌజ్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యున్నత స్థాయిలో తమ ఆందోళన చేసిందని, దీనికి బాధ్యులు బాధ్యత వహించాలని అమెరికా ఇండియాకు హెచ్చరీకలు జారీ చేసింది. ఇలాంటి ఉద్ధేశం తమ విధానం కాదని భారత్ అమెరికాకు గట్టిగానే సమాధానం ఇచ్చింది.
కమిటీ లో వచ్చే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు
ఈ అంశంపై భారత్ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. మరోవైపు పన్నూని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. పన్నూ ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక అమెరికా-కెనడా ద్వంద పౌరసత్వం కూడా అతనికి ఉంది. కమిటీలో రిపోర్టులో వచ్చే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బాగ్చీ పేర్కొన్నాడు. జూన్ నెలలో కెనడాలోని సర్రే నగరంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.