Page Loader
'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'  
'పన్ను హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'

'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'  

వ్రాసిన వారు Stalin
Dec 16, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు ఇండియా నుంచి కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్-అమెరికా దౌత్యపరమైన వాదోపవాదనలు జరుగుతున్నాయి. పన్నూన్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాపై వచ్చిన అభియోగాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని యూఎస్ కాంగ్రెస్‌లోని ఐదుగురు భారతీయ-అమెరికన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే.. ఈ అభియోగాలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీయొచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో అధికార డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారత సంతతి ఎంపీలు అమీ బెరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీ తానేదార్ ఉన్నారు.

అమెరికా

కేసు దర్యాప్తు పారదర్శకంగా ఉండాలి: ఎంపీలు

భారత అధికారులు పన్నూ హత్య కుట్ర కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయకపోతే అది రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని ఎంపీ ప్రకటనలో తెలిపారు. ఇదే విషయాన్ని బైడెన్ ప్రభుత్వం తమకు తెలియజేసిందని వారు పేర్కొన్నారు. నిఖిల్ గుప్తాపై ఆరోపణల అంశంపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దిల్లీ ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. పన్ను హత్యకు జరిగిన కుట్రకు సంబంధించిన దర్యాప్తులో దోషులుగా ఉన్న భారత అధికారులను గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎంపీలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.