NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?
    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?
    అంతర్జాతీయం

    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?

    వ్రాసిన వారు Naveen Stalin
    September 19, 2023 | 10:27 am 0 నిమి చదవండి
    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?
    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?

    ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య ఉదంతం భారత్, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రగిల్చింది. నిజ్జర్‌ హత్యకు భారత్‌కు సంబంధం ఉందంటూ సాక్షాత్తు కెనడా పార్లమెంట్ వేదికగా ఆ దేశ ప్రధాని ట్రూడో చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ప్రతీకార చర్యగా ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను కెడనా బహిష్కరించింది. అయితే కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. అవి నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఇంతకీ భారత్, కెనడా మధ్య వివాదం చెలరేగానికి కారణమైన ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను దుండగులు కాల్చి చంపారు. సర్రేలోని గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది.

    హర్దీప్ సింగ్ నిజ్జర్‌ స్వగ్రామం జలంధర్‌లోని భర్‌సింగ్‌పురా

    హర్దీప్ సింగ్ నిజ్జర్‌ భారత్‌లోని జలంధర్‌లో గల భర్‌సింగ్‌పురా గ్రామానికి చెందినవారు. 1997లో పంజాబ్ నుంచి కెనడాకు వెళ్లి ప్లంబర్‌గా అక్కడే సెటిల్ అయ్యారు. అతనికి వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. కెనడాకు వలస వచ్చినప్పటి నుంచి అతను ఖలిస్థాన్ మిలిటెన్సీ గ్రూప్‌లో కీలకంగా పని చేశారు. భారత్ ప్రభుత్వం నిషేదిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్‌గా కొనసాగారు. నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే)లో నిజ్జర్ సభ్యుడు కూడా. నిజ్జర్‌ను 2020లో భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజాబ్‌లోని లూథియానాలో 2007లో ఆరుగురు మరణించిన, 40మంది గాయపడిన పేలుడుతో సహా అనేక కేసుల్లో నిజ్జర్ వాంటెడ్‌గా ఉన్నారు. నిజ్జర్‌పై ఎన్‌ఐఏ రూ.10లక్షల రివార్డును ప్రకటించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కెనడా
    ఖలిస్థానీ
    భారతదేశం
    తాజా వార్తలు

    కెనడా

    ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను ఖండించిన భారత్  ఖలిస్థానీ
    ఖలిస్తానీ ఉగ్రవాది హత్య ఆరోపణలపై భారత దౌత్యవేత్తను తొలగించిన కెనడా ఖలిస్థానీ
    ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్  భారతదేశం
    కెనడాలోని బస్టాప్‌లో సిక్కు యువకుడిపై పిడిగుద్దులు.. విచారణకు ఆదేశించిన అధికారులు  అంతర్జాతీయం

    ఖలిస్థానీ

    కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన  నరేంద్ర మోదీ
    'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు  దిల్లీ
    జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు దిల్లీ
    చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ  చండీగఢ్

    భారతదేశం

    ఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్  అమెరికా
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు?  చైనా
    G-20 సమావేశానికి భారత్ భారీ వ్య‌యం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు జీ20 సమావేశం

    తాజా వార్తలు

    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  నరేంద్ర మోదీ
    శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం  శివసేన
    కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే  ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023