Nitin Gadkari : కంపెనీలు కుమ్మకై ధరలను పెంచేస్తున్నాయి : నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీలో భారత జాతీయ హైవే అధారిటీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వాపోయారు.
నూతన టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్ 2023ని ఉద్ధేశించి ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా స్టీల్, సిమెంట్ పరిశ్రమలో కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలను పెంచుతున్నాయని ఆయన మండిపడ్డారు.
Details
భారత్ లో రవాణా వ్యయం 14-16శాతంగా ఉంది
డీపీఆర్‌లను అంగీకరించేందుకు వీటితో ప్రమేయమున్న సంస్థలు ఉండటం లేదని, అందుకే ప్రతిచోట డీపీఆర్ నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు.
ఇక దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా డీపీఆర్, కాంట్రాక్టర్లకు రేటింగ్ ఇవ్వాలని ఆయన సూచించారు.
చైనాలో రవాణా వ్యయం 8-10 శాతం ఉంటే భారత్‌లో 14-16శాతంగా ఉందన్నారు.