నితిన్ గడ్కరీ: వార్తలు

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి టోల్ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో నేషనల్ హైవేస్ (ఎన్‌హెచ్‌లు), ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించే ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. టోల్ ధరలను 5శాతం నుంచి 10శాతానికి పెంచే ఆలోచనలో ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం

రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ(MRTH) జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగ పరిమితులను పెంచాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత స్పీడ్ రివిజన్ భారతదేశ రవాణా మౌలిక సదుపాయాల భద్రతా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం.

28 Feb 2023

టాటా

మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ ఈరోజు తన తొలి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF), Recycle with Respectని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించారు.

06 Feb 2023

ముంబై

'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్

ఎవరైనా దూరప్రయాణాలకు వెళ్లేటప్పడు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవాలంటే విమానాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు విమానాల కంటే వేగంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లొచ్చని చెబుతున్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఆజ్‌తక్ నిర్వహించిన కాన్‌క్లేవ్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ

భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.