
VEUP: హైదరాబాద్-విజయవాడ హైవే పై వీఈయూపీకి బ్రిడ్జ్ గ్రీన్ సిగ్నల్.. ఇక ప్రమాదాలకు గుడ్‌బై!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలకే కేంద్రబిందువుగా మారిన ప్రాంతాల్లో చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం కూడలి ఒకటి.
గతంలో ఇక్కడ జరిగిన అనేక రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు, స్థానికులు ఎప్పటి నుంచో అండర్‌పాస్ నిర్మాణం కోసం విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.
ఈ అంశాన్ని గుర్తించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అధికారులు ఇటీవల వెహికల్ అండర్‌పాస్ వంతెన (VUP) నిర్మాణానికి అనుమతులు పొందారు.
ప్రస్తుతం ఈ వంతెనకు సంబంధించిన డిజైన్ పనులు జరుగుతున్నాయి.
డిజైన్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, వారం రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపారు.
Details
పర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న నితిన్ గడ్కరీ
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ రోజు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.
దండుమల్కాపురం పారిశ్రామిక పార్కు, దాబా హోటళ్ల సమీపంలోనూ ఇటువంటి వంతెనల అవసరం ఉన్నట్లు స్థానికులు అంటున్నారు.
ఆంధోల్ మైసమ్మ దేవాలయానికి వెళ్లే భక్తులు, పార్కులో పనిచేసే కార్మికులు రహదారిని క్రాస్ చేయడానికి సురక్షిత మార్గాలు లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ విషయాన్ని పార్కు ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్‌హెచ్ఏఐ అధికారులు దండుమల్కాపురం నుంచి IOCL టెర్మినల్ వరకు మరో అండర్‌పాస్ వంతెన అవసరమని గుర్తించారు.
Details
ఆరు వరుసలకు విస్తరించేందుకు వేగంగా పనులు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసల రహదారిగా ఉండగా, దానిని ఆరు వరుసలకు విస్తరించేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి.
భూసేకరణ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో, కొత్తగా గుర్తించిన 17 ప్రమాదకర ప్రాంతాల్లో (బ్లాక్ స్పాట్స్) ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు నిర్మించే ప్రణాళికపై అధికారులు దృష్టి సారించారు.
ఈ చర్యలన్నీ రహదారి భద్రతను మెరుగుపరచడానికి కీలకమవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.