Page Loader
'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు',  నితిన్ గడ్కరీ కామెంట్స్
రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణం వేగవంతం అవుతుందని గడ్కరీ హామీ

'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్

వ్రాసిన వారు Stalin
Feb 06, 2023
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎవరైనా దూరప్రయాణాలకు వెళ్లేటప్పడు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవాలంటే విమానాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు విమానాల కంటే వేగంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లొచ్చని చెబుతున్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఆజ్‌తక్ నిర్వహించిన కాన్‌క్లేవ్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రధాన నగరాల మధ్య రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణం వేగవంతం అవుతుందని గడ్కరీ హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 12న దిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. ముంబయి-దీల్లీతో పాటు పలు నగరాలు మధ్య గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలను కేంద్రం నిర్మిస్తోంది. వీటికోసం ప్రయాణికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని, ఇవి అందుబాటులోకి వస్తే విమానాల కంటే వేగంగా రోడ్డుపై ప్రయాణించవచ్చని చెప్పారు గడ్కరీ.

గడ్కరీ

మౌలిక సదుపాయాలపై పెట్టుబడి ద్వారా పేదరిక నిర్మూన

2024 చివరి నాటికి భారత్‌లో అమెరికా ప్రమాణాలకు సమానమైన రోడ్లు ఉంటాయని గడ్కరీ ఉద్ఘాటించారు. జాతీయ రహదారుల కోసం కేంద్రం ఈ బడ్జెట్‌లో రూ. 24,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గతంలో ఈ కేటాయింపులు రూ.12వేలు ఉండగా, ఈసారి రూ.24వేల కోట్లకు పెంచినట్లు చెప్పారు. నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలపై పెట్టే పెట్టుబడులు పేదరికాన్ని నిర్మూలించడానికి, దేశ అభివృద్ధికి దోహదపడుతాయని గడ్కరీ అన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే, అవి పరిశ్రమలను ఆకర్షిస్తాయన్నారు. తద్వారా మూలధన పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. ఎక్కువ మూలధన పెట్టుబడి వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఇది దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని వ్యాఖ్యానించారు.