Nitin Gadkari: "4వ టర్మ్‌లో అధికారంలోకి వస్తామో, రామో కానీ..": నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో చమత్కరాలు తరచుగా వినిపిస్తుంటాయి. తాజాగా ఆయన తోటి మంత్రిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ''మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేము కానీ, రాందాస్ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం ఉంది'' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చేసినప్పుడు, అక్కడున్నవారు చిరునవ్వులు చిందించారు. అప్పుడు ఆ వేదికపై వేదికపై అథవాలే కూడా ఉండటంతో, గడ్కరీ తన వ్యాఖ్యలను జోక్‌గా చెప్పినట్టు స్పష్టతనిచ్చారు.
మూడుసార్లు మంత్రిగా రాందాస్ అథవాలే
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) నేత రాందాస్ అథవాలే వరుసగా మూడుసార్లు మంత్రిగా ఉన్నారు. బీజేపీ మరోసారి గెలిస్తే, తన పదవి కొనసాగుతుందన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ కూడా భాగమై ఉంది, త్వరలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, అథవాలే పార్టీ కూడా వాటిలో పోటీ చేయనుంది.