New toll collection system: ఏడాదిలోనే దేశవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రానిక్ టోల్ విధానం
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి శుభవార్త. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుత విధానం తెర మరుగై.. ఏడాదిలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని తెలిపారు. ప్రస్తుతం ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ప్రయోగం చేస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ప్రశోత్తరాల సమయంలో దీనిపై ఆయన మాట్లాడారు.
వివరాలు
ఇది పూర్తిగా ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది
''ఇప్పుడు టోల్ వసూలులో కొత్త సిస్టమ్ ప్రవేశపెడతాం. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ మిమ్మల్ని ఆపరు. దేశవ్యాప్తంగా ఏడాదిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నాం'' అని గడ్కరీ తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా రూ.10లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఇంకా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది, టోల్ ఫీజు వసూలు కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. వాహనం టోల్ ప్లాజా ద్వారా వెళ్లిన వెంటనే, వాహనాన్ని ఆపాల్సిన అవసరం లేకుండా వాహన యజమాని బ్యాంక్ అకౌంట్ నుంచి ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.