LOADING...
వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ  
వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ

వీడియో:"మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్" ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని పరిచయం చేసిన నితిన్ గడ్కరీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2023
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే గా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. NH నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ ముగుస్తుంది. ఈ హైవే 563 కి.మీ వెడల్పుతోనిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దేశంలో మొట్టమొదటిసారి 1200 చెట్లను తిరిగి నాటారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ఢిల్లీ-హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి.ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వీడియోను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదల చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ ఘనత..ద్వారకాఎక్స్‌ప్రెస్‌వే..అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అంటూ కోట్ చేశారు.

Details 

సెక్టర్ 25లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీ

వీడియోలో చూపించిన ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు,మానేసర్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు 20 నిముషాలు,ద్వారకా నుండి సింఘు బోర్డర్ వరకు 25 నిముషాలు,మానేసర్ నుండి సింఘు బోర్డర్ వరకు 45 నిముషాల ప్రయాణ సమయం ఉంటుందని కేంద్ర రవాణా శాఖ తెలిపింది . ఈ హైవే గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని పెరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను కూడా నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడులైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు.

Details 

 ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ 

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఐరన్ ను వినియోగించారు. ఇది పారిస్ ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ. అలాగే, ఈ ప్రాజెక్టులో 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల సిమెంట్‌ కాంక్రీటును ఉపయోగించారు. ఇంకో విశేషమేమంటే ప్రపంచ ప్రఖ్యాత దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఇది ఆరు రేట్లు ఎక్కువ .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోని ట్వీట్ చేసిన గడ్కరీ