మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ ఈరోజు తన తొలి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF), Recycle with Respectని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించారు. అధికారిక ప్రకటన ప్రకారం, ప్రతి సంవత్సరం RVSFలో 15,000 వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని టాటా మోటార్స్ భాగస్వామి గంగానగర్ వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది. అన్ని బ్రాండ్‌ల ప్యాసింజర్ వాహనాలు (PVలు), వాణిజ్య వాహనాలు (CVలు) రెండింటినీ ఇక్కడ స్క్రాప్ చేయవచ్చు.
భారతదేశాన్ని దక్షిణాసియా మొత్తానికి వాహనాల స్క్రాపింగ్ హబ్‌గా మార్చే ప్రయత్నం
కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా తొలగించి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రవేశపెట్టారు. వాటి స్థానంలో ఇంధన-సమర్థవంతమైన వాహనాలను తీసుకురావడమే లక్ష్యమని గడ్కరీ చెప్పారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో సమానంగా ఈ నాణ్యతా సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు టాటా మోటార్స్‌ను అభినందిస్తున్నాను. భారతదేశాన్ని దక్షిణాసియా మొత్తానికి వాహనాల స్క్రాపింగ్ హబ్‌గా మార్చేందుకు మేము కృషి చేస్తున్నామని భారతదేశంలోని ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్, రీసైక్లింగ్ అవసరమని ఆయన అన్నారు. ఈ సదుపాయం పేపర్‌లెస్ కార్యకలాపాల కోసం పూర్తిగా డిజిటలైజ్ చేయబడింది. టైర్లు, బ్యాటరీలు,ఇంజిన్ వంటి భాగాలను సురక్షితంగా విడదీయడానికి ఇందులో ప్రత్యేక స్టేషన్‌లు ఉన్నాయి.