Page Loader
2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది
రెండు SUVలలో విశాలమైన సెవెన్-సీటర్ క్యాబిన్‌ ఉంటుంది

2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 27, 2023
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో సఫారీ 2023 అప్డేట్ ప్రారంభించింది, మార్కెట్లో ఏడు సీట్ల SUV విభాగంలో మహీంద్రా XUV700కి పోటీగా ఉంటుంది. సఫారీ ఈమధ్య కాలంలో టాటా మోటార్స్ నుండి అత్యంత సమర్థవంతమైన కార్లలో ఒకటి. అయితే, XUV700లో లెవెల్ 2 ADAS ఫంక్షన్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ వంటి ఇతర ప్రీమియం ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా సెవెన్-సీటర్ SUV కేటగిరీలో మహీంద్రా దూకుడు పెంచింది. MY-2023 అప్‌గ్రేడ్‌లతో, సఫారి మహీంద్రాతో పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. టాటా సఫారి 2.0-లీటర్ "క్రియోటెక్" టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ తో నడుస్తుంది. మహీంద్రా XUV700 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్, 2.2-లీటర్ డీజిల్ మోటార్‌పై నడుస్తుంది.

టాటా

రెండు SUVలలో విశాలమైన సెవెన్-సీటర్ క్యాబిన్‌ ఉంటుంది

రెండు SUVలలో విశాలమైన సెవెన్-సీటర్ క్యాబిన్‌ ఉంటుంది. 2023 టాటా సఫారిలో ఫాక్స్ వుడ్ డ్యాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లూ కలర్ యాంబియంట్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. మహీంద్రా XUV700లో యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్ తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. భారతదేశంలో, 2023 టాటా సఫారి ధర రూ.15.65 లక్షలు నుండి రూ.24.82 లక్షలు ఉంటుంది, మహీంద్రా XUV700 రూ.13.45 లక్షలు నుండి రూ.25.48 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంటుంది. సాధారణ SUV సిల్హౌట్, ప్రీమియం క్యాబిన్ తో పాటు మరిన్ని ఇంజన్ ఆప్షన్స్, తక్కువ ప్రారంభ ధరతో మహీంద్రా XUV700 కొనడం మంచిది.