2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి
టాటా ఫ్లాగ్‌షిప్ SUV, సఫారి, 2023లో అప్‌డేట్ వస్తుంది. SUV గత సంవత్సరం అప్డేట్ లాంచ్ అయినప్పటి నుండి మంచి అమ్మకాలను సాధిస్తోంది. అయితే, మహీంద్రా XUV700, స్కార్పియో N రాక 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగింది. ఈ రెండు మోడల్స్ సఫారి కంటే మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి. టాటా 2023లో టాటా సఫారీని కొత్త అవతారంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ మోడల్ అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీతో వస్తుందని ప్రచారం జరుగుతుంది. SUV ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో రాడార్లు, సెన్సార్లు ఉన్న ADAS కిట్ అమర్చబడుతుంది. బయటి భాగాలు మిగతా మోడల్స్ లాగానే ఉండచ్చు. గ్రిల్ లేదా హెడ్‌ల్యాంప్‌లో, వెనుకభాగంలో ఎటువంటి మార్పులు ఉండవు.
మార్కెట్ లో మహీంద్రా XUV700, స్కార్పియో N వంటి వాటితో పోటీ పడే అవకాశం
అయితే క్యాబిన్ లోపల కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరింత మెరుగైన డ్యూయల్-టోన్ కలర్ అవుట్‌లేతో సహా కొన్ని అప్‌డేట్‌లు ఉండచ్చు. 2023 టాటా సఫారి దాని క్రియోటెక్ 2.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌తో కొనసాగచ్చు. టాటా సఫారి ధర రూ. 15.45 లక్షలతో మొదలై రూ. 23.76 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్త ఫీచర్లతో, 2023 మోడల్ ధర ఇప్పుడు ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అమ్మకాలు ప్రారంభం అయిన తర్వాత, 2023 టాటా సఫారి భారతీయ మార్కెట్లో MG హెక్టర్ ప్లస్, జీప్ కంపాస్, మహీంద్రా XUV700, స్కార్పియో N వంటి వాటితో పోటీ పడుతుంది.