కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.
దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు.
జనవరి 14న కూడా దావూద్ సభ్యుడనని గడ్కరీ నివాసం, కార్యాలయానికి ఓ వ్యక్తి ఇలాంటి కాల్స్ చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. 14వ తేదీన ఉదయం 11.25 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య గడ్కరీ పీఆర్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు మూడు బెదిరింపు కాల్‌లు వచ్చాయి.
నితిన్
సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు
జనవరిలో బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఇల్లు, కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. తన డిమాండ్‌ను నెరవేర్చకుంటే మంత్రిని బాంబుతో సమాధానం చెబుతానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. అయితే కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారి అనే వ్యక్తి అని ఆ తర్వాత పోలీసులు గుర్తించారు.
మరో సంఘటనలో గడ్కరీని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే ఆరోపణలపై నాగ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగ్‌పూర్ పోలీసుల సైబర్ సెల్ నిందితుడిపై కేసు నమోదు చేసింది.
సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేసింది దత్తాత్రే జోషి అని తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.