Nitin Gadkari: జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వాని కోరవద్దు: కేంద్రమంత్రి గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పరిశ్రమ వర్గాలకు సూచిస్తూ, జీఎస్టీ (GST),ఇతర పన్నులను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరొద్దని తెలిపారు.
పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమని, అందుకే పన్నులను తగ్గించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ పన్నులను తగ్గిస్తే, మరింత తగ్గించాల్సిందిగా ప్రజలు కోరతారని, ఇది మనుషుల సహజమైన మనస్తత్వమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం కూడా పన్నులను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉందని, అయితే అలా చేయడం వల్ల ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు.
ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి, ఆ నిధులను పేదల అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ దార్శనికత అని వివరించారు.
వివరాలు
గుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాలి
లాజిస్టిక్స్ ఖర్చు గురించి మాట్లాడుతూ, దేశంలో వచ్చే రెండేళ్లలో ఈ వ్యయం 9 శాతానికి తగ్గుతుందని పరిశ్రమ వర్గాలకు మంత్రి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతం ఉంటే, యూఎస్ (US), ఐరోపా (Europe) దేశాల్లో ఇది 12 శాతం ఉందని తెలియజేశారు.
మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చని అన్నారు.
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే, దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.