komatireddy: హైదరాబాద్-మచిలీపట్నం హైవే నిర్మాణం రెండు ప్యాకేజీలుగా : గడ్కరీ ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అనుమతులు రెండు నెలల్లో పూర్తవుతాయని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాత ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
రీజినల్ రింగ్‌రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశం అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
సంగారెడ్డి - భువనగిరి - చౌటుప్పల్ వరకు ఆర్‌ఆర్‌ఆర్ టెండర్ల ప్రక్రియ పూర్తయింది. దాదాపు 95శాతం భూ సేకరణ కూడా పూర్తయింది. రూ. 1,000 కోట్లతో 12 ఆర్వోబీలు (రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు) మంజూరయ్యాయి.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణను వేగవంతం చేయాలని గడ్కరీ ఆదేశించారు.
Details
విడివిడిగా టెండర్లు
హైదరాబాద్ - మచిలీపట్నం రహదారి పనులు ఆలస్యమవుతున్న కారణంగా, గుడిమల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీగా, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని గడ్కరీ సూచించారు.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి 62 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌పై ప్రత్యేకంగా చర్చించేందుకు కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించారని కోమటిరెడ్డి తెలిపారు.