Bharat NCAP: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 'భారత్ ఎన్‌సీఏపీ' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన నితిన్ గడ్కరీ
కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ BNCAP (Bharat New Car Assessment Program) ప్రోగ్రామ్ ని లాంచ్ చేసారు. దీని ప్రకారం యాక్సిడెంట్‌లో కారు ఎంతమేరకు పాడవుతుందో అంచనా వేస్తారు. కారు తయారీ దారులు తమ కార్లను క్రాష్ టెస్టింగ్‌కి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ టెస్ట్ పూర్తయిన తర్వాత రేటింగ్స్ ఇస్తారు. ఈ రేటింగ్స్ ని బట్టి కారులో భద్రతా ప్రమాణాలు ఎంత మేర ఉన్నాయనేది గుర్తిస్తారు. కార్ల తయారీదార్లు స్వచ్ఛందంగా తమ మోడల్ కార్‌ని టెస్ట్ కి పంపించాల్సి ఉంటుంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 197 ప్రకారం కారు టెస్ట్ జరుగుతుంది.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే కొత్త ప్రోగ్రామ్
దీనివల్ల వినియోగదారులకు కారు భద్రతా ప్రమాణాలు అర్థమవుతాయని, తద్వారా అత్యంత భద్రతా ప్రమాణాలను కలిగిన కార్లను ఎంచుకునే అవకాశం ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అలాగే ఇటు కార్ల తయారీదారులకు వినియోగదారులకు కావాల్సిన అవసరాలు తెలుస్తాయని, అలాగే ప్రపంచ మార్కెట్ లో ఇతర కంపెనీలతో పోటీ పెరుగుతుందని నితిన్ గడ్కరీ తెలియజేసారు. BNCAP ప్రోగ్రామ్ అక్టోబర్ 1వ తేదీ నుంచి మొదలు కానుందని, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడానికే ఇలాంటి కొత్త ప్రోగ్రామ్ ని తీసుకువచ్చామని నితిన్ గడ్కరీ తెలిపారు.