
Nitin Gadkari: భారత్ ఆటోమొబైల్ దిగ్గజంగా ఎదుగుతోంది : నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశానికి సన్నాహాలు చేస్తోంది.
ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుని షోరూం ఏర్పాటు చేయనుంది.
ఈ క్రమంలో ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. టెస్లా రాకతో దేశీయ కార్ల తయారీ సంస్థలపై ప్రభావం ఉంటుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
Details
గడ్కరీ ఏమన్నారంటే?
ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
'బిజినెస్ టుడే మైండ్‌రష్ 2025 ఫోరమ్'పాల్గొన్న ఆయన, భారత ఆటోమొబైల్ పరిశ్రమ టెస్లా రాకతో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోనదని స్పష్టం చేశారు.
దేశీయ సంస్థలు సాంకేతికత పరంగా ఎంతో పురోగతి సాధిస్తున్నాయన్నారు.
రానున్న ఐదేళ్లలో భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో రెండో అతిపెద్దదిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Details
ఆటోమొబైల్ పరిశ్రమ ప్రగతి
2014లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం ఇది రూ.22 లక్షల కోట్లకు చేరిందని గడ్కరీ వివరించారు.
అమెరికా (రూ.78 లక్షల కోట్లు), చైనా (రూ.49 లక్షల కోట్లు) తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందన్నారు.
త్వరలోనే ప్రపంచానికి ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయనున్నాయని వెల్లడించారు.
Details
ఎగుమతుల లక్ష్యం
గడ్కరీ మాట్లాడుతూ, త్వరలో భారత్ నుంచి ఈవీలతో పాటు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, బస్సులను ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.
రానున్న ఐదేళ్లలో హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు చేయనున్నామని చెప్పారు.
ఈవీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటోమేకర్‌గా భారత్ అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు.
టెస్లా ఎంట్రీతో దేశీయ కంపెనీలకు కొత్త పోటీ ఏర్పడనుంది. కానీ దీని వల్ల నాణ్యత పెరగడం, ధరలు తగ్గడం వంటి ప్రయోజనాలు భారత వినియోగదారులకు లభిస్తాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.