Page Loader
Nitin Gadkari: ప్రధాన మంత్రి పదవిపై ఆశ లేదు: నితిన్ గడ్కరీ 
ప్రధాన మంత్రి పదవిపై ఆశ లేదు: నితిన్ గడ్కరీ

Nitin Gadkari: ప్రధాన మంత్రి పదవిపై ఆశ లేదు: నితిన్ గడ్కరీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2024
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒకసారి ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నప్పుడు తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు ఆ పదవి మీద ఎలాంటి ఆశ లేదని శనివారం జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. నాగ్‌పూర్‌లో జరిగిన జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మీరు ప్రధాని అవుతారంటే తాము మద్దతిస్తాం అని ఓ రాజకీయ నాయకుడు అన్నారని, కానీ తాను ప్రధానమంత్రిగా మారడం తన లక్ష్యం కాదని చెప్పానని వెల్లడించారు.

Details

తాను ఏ పదవి కోసం రాజీపడను

తన జీవితం ప్రధాని పదవి కోసం కాదని తన విలువలకు, తన పార్టీకి విధేయుడిని. తాను ఏ పదవి కోసం రాజీపడనని గడ్కరీ వివరించారు. ఈ ఏడాది జరిగిన "ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్" సర్వేలో కూడా ఆయన, ప్రధాన మంత్రి మోడీ తర్వాత మూడవ స్థానంలో ఉన్నారు. అయితే 2019లో కూడా ఈ చర్చలు జరిగినప్పుడు, గడ్కరీ స్పష్టంగా తెలిపారు. మూడుసార్లు నాగ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్కరీ, బీజేపీకి ఒక కీలక నేతగా ఉన్నారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కూడా బలమైన మద్దతును పొందుతూ పదేళ్లుగా రోడ్డు రవాణా, రహదారుల శాఖలో అత్యధిక కాలం పని చేసిన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.