
Gadkari: కేంద్రమంత్రి గడ్కరీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం.. గంటల్లోనే నిందితుడు అదుపులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) నివాసానికి వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గడ్కరీ నివాసానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు చెప్పాడు. ఈ సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఇంటి పరిసరాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపు కాల్ (Hoax Call) అని పోలీసులు తేల్చారు.
Details
నకిలీ కాల్ గా గుర్తింపు
ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కాల్ చేసిన నంబర్‌ను ట్రేస్ చేసి విచారణ చేపట్టారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నకిలీ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి పేరు ఉమేష్ విష్ణు రౌత్ అని తెలిపారు. అతను నాగ్‌పూర్ తులసిబాగ్ రోడ్‌లోని ఒక మద్యం షాపులో పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అతడిని నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపుకు గల నిష్కర్షలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.