Page Loader
Nitin Gadkari:  వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ
వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ

Nitin Gadkari:  వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుండటంతో,రానున్న రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని తెలిపారు. నీతి ఆయోగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14శాతంగా ఉందని,యూరప్,అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు సుమారు 12శాతంగా ఉందని వివరించారు. చైనాలో ఈ ఖర్చు 8 శాతమేనని కూడా చెప్పారు.

వివరాలు 

ప్రపంచ సగటు 8 శాతం కంటే ఎక్కువ

గడ్కరీ పేర్కొన్నట్లు,మన దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 7.8 శాతం నుంచి 8.9 శాతం మధ్య ఉండగా, 2022-23లో ఇది 14-18 శాతం వరకు పెరిగిందని చెప్పారు. ఇది ప్రపంచ సగటు 8 శాతం కంటే ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకా ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాల ఎగుమతికి భారత్‌కు గొప్ప అవకాశాలు ఉన్నాయని అన్నారు. మిథనాల్ ఉత్పత్తిలో నాణ్యత లేని బొగ్గు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలన్న లక్ష్యం తనదని గడ్కరీ తెలిపారు.