2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ
భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వచ్చే ఏడాది తమ మంత్రిత్వ శాఖ రూ.5 లక్షల కోట్లతో ప్రాజెక్టు పనులు చేపడుతుందని, అందులో రూ.2 లక్షల కోట్లు ప్రభుత్వం నుంచి వస్తాయని, మిగిలిన మొత్తాన్ని క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరించనున్నట్లు గడ్కరీ తెలిపారు. "ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 7.5 లక్షల కోట్లుగా ఉంది. 2024 చివరికి దీనిని రూ. 15 లక్షల కోట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం" అని గడ్కరీ ఒక వర్చువల్ సెషన్‌లో చెప్పారు.
సామూహిక పెట్టుబడి పథకం వలన పెట్టుబడిదారులకు లభ్యం
బయో ఇథనాల్, బైల్-సిఎన్‌జి, బయో-ఎల్‌ఎన్‌జి మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ, స్వచ్ఛమైన, ఆకుపచ్చ ఇంధనాలను అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. Infrastructure Investment Trust వంటి సామూహిక పెట్టుబడి పథకం వలన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వ్యక్తిగత మరియు సంస్థాగత పెట్టుబడిదారుల నుండి ప్రత్యక్ష పెట్టుబడి వచ్చిందని అది వారికి కూడా కొంత ఆదాయాన్ని ఇస్తుందని చెప్పారు. నిర్మాణ వ్యయం కూడా రీసైకిల్ మెటీరీయల్ వంటి ప్లాస్టిక్, రబ్బర్ వంటి వాటిని ఉపయోగించి తగ్గించచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2030 కల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో భారతదేశం ముందుంటుందని గడ్కరీ అన్నారు.