NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP TG Roads: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ర‌హ‌దారుల అభివృద్ధికి నిధులు మంజూరు 
    తదుపరి వార్తా కథనం
    AP TG Roads: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ర‌హ‌దారుల అభివృద్ధికి నిధులు మంజూరు 
    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్

    AP TG Roads: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ర‌హ‌దారుల అభివృద్ధికి నిధులు మంజూరు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    09:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసింది.

    మొత్తం 200.06 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రహదారుల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

    అదనంగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో సేతు బంధన్ పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలో గుంటూరు-నల్లపాడు రైల్వే సెక్షన్‌లో నాల్గో లైన్ కోసం రూ. 98 కోట్లు ఆమోదించినట్లు పేర్కొన్నారు.

    తెలంగాణ 

    తెలంగాణకు రూ. 516 కోట్లు మంజూరు 

    తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి రూ. 516 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ-ఏపీని కలిపే జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)-565 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    నల్గొండ టౌన్ బైపాస్‌కు సంబంధించిన నాలుగు లేన్ల రహదారిని నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు గడ్కరీ తెలిపారు.

    నకిరేకల్ నుండి నాగార్జునసాగర్ సెక్షన్ వరకు నిర్మాణం జరగనున్న ఈ 14 కిలోమీటర్ల 4 లేన్ బైపాస్ రహదారి కోసం రూ. 516 కోట్లు కేటాయించారు.

    తెలంగాణ-ఏపీ మధ్య కనెక్టివిటీ మెరుగుపర్చడంలో ఈ రహదారి కీలకంగా మారనుందని,నకిరేకల్ వద్ద ఎన్‌హెచ్‌- 65 జంక్షన్ నుంచి నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి పట్టణాల మీదుగా ఈ రహదారి వెళ్తుందని వివరించారు.

    వివరాలు 

    ఏపీ, తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వాటా 

    ప్రస్తుతం నల్గొండ పట్టణం భారీ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందిపడుతుండగా, ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ తగ్గిపోతుందని, నకిరేకల్-నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని చెప్పారు. రహదారి భద్రతను కూడా పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ. 3,745 కోట్లు విడుదల చేశారు.

    అక్టోబర్ నెలకు సంబంధించి ఈ పన్నుల వాటాను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మొత్తం 28 రాష్ట్రాలకు కేంద్రం రూ. 1,78,173 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్‌కు 15వ ఆర్థిక సంఘం నిధులు 

    ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధుల్ని విడుదల చేసింది.

    మొత్తం రూ. 988 కోట్లను మొదటి విడతగా అందజేసినట్లు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    ఈ నిధులు 9 జిల్లా పంచాయతీలు, 615 బ్లాక్ పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు సంబంధించినవని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ

    ఆంధ్రప్రదేశ్

    AP Govt: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ.. జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ భారతదేశం
    Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత ప్రకాశం జిల్లా
    Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్

    తెలంగాణ

    DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం.. భారతదేశం
    Hydra: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కూల్చివేతలు శని, ఆదివారాల్లో ఎందుకు? హైడ్రా
    Telangana DSC Results 2024: అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా భారతదేశం
    Somashila: తక్కువ ఖర్చుతో అనువైన పర్యటన.. తెలంగాణలో మినీ మాల్దీవులకు వెళ్లండి..! హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025