Page Loader
కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు: నితిన్ గడ్కరీ
కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు: నితిన్ గడ్కరీ

కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు: నితిన్ గడ్కరీ

వ్రాసిన వారు Stalin
Sep 13, 2023
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. అన్ని కార్లకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రయాణికుల భద్రతను పెంచేందుకు 2023 అక్టోబర్‌ నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్‌‌లను నిబంధనను అమలు చేయాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ తర్వాత నితిన్ గడ్కరీ దీన్ని సమర్థించారు. అయితే ఇప్పుడు ఆయన తన మాటలను సవరించి, 6 ఎయిర్ బ్యాగ్‌లు తప్పసరి కాదు అని చెప్పడం గమనార్హం.

గడ్కరీ

బీఎన్‌సీఏపీ 5-స్టార్ రేటింగ్‌ రావాలంటే 6 ఎయిర్ బ్యాగ్‌లు ఉండాల్సిందే

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి, ఏప్రిల్ 1, 2021 తర్వాత తయారు చేసిన వాహనాల్లో రెండు ముందు సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అందువల్ల, అన్ని కార్ల మోడల్‌లకు 2 ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి ఉంటున్నాయి. ఎయిర్ బ్యాగ్ అనేది వాహన-నియంత్రణ వ్యవస్థ. ప్రమాద సమయంలో తీవ్రమైన గాయాలను ఎయిర్ బ్యాగ్‌లు నివారిస్తాయి. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (బీఎన్‌సీఏపీ) 5-స్టార్ రేటింగ్‌లను సాధించడానికి కార్లలో ఆరు సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరచాల్సి ఉంటుంది. అయితే ఆరు బ్యాగ్‌లు తప్పనిసరి కాదని, 5స్టార్ రేటింగ్ కావాలంటే 6బ్యాగ్‌లను అమర్చాల్సిందేనని స్పష్టం చేసారు.