Nitin Gadkari : ఇకపై జాతీయ రహదారులపై గుంతలుండవు : నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది డిసెంబర్ నాటికి జాతీయ రహదారులను గుంతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీపేర్కొన్నారు.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధి విధానాలను సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.
ఇప్పటికే దేశంలోని 1,46,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తెందని, త్వరలోనే గుంతలను పూడ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ రహదారుల నిర్మాణం జరిగితే ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని గడ్కరీ వ్యాఖ్యానించారు.
Details
బీవోటీ పద్ధతిలో కాంట్రాక్టర్లు
సాధారణంగా రహదారుల నిర్మాణం మూడు పద్ధతుల్లో జరగనుంది. బీవోటి, ఇంజనీరింగ్-ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC), హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (HAM) ఈపీసీ కింద నిర్మించిన రోడ్లకు త్వరగా నిర్వహణ చేపట్టాల్సి ఉంది.
బీవోటి కింద నిర్మించిన వాటికి 15-20 ఏళ్ల పాటు నిర్వహణ ఖర్చును గుత్తేదారు భరించాల్సి ఉంటుంది.
ఈపీసీ విధానంలో రోడ్డు నిర్మాణం, నిర్వహణకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని, అందుకే బీవోటి పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని నితిన్ గడ్కరీ వెల్లడించారు.