Page Loader
ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం
ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ

ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం

వ్రాసిన వారు Stalin
Mar 06, 2023
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి టోల్ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో నేషనల్ హైవేస్ (ఎన్‌హెచ్‌లు), ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించే ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. టోల్ ధరలను 5శాతం నుంచి 10శాతానికి పెంచే ఆలోచనలో ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నట్లు తెలుస్తోంది. టోల్ ప్లాజాలను తొలగించి, వాటి స్థానంలో నంబర్ ప్లేట్‌లను చదివే కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని గతంలోనే ప్రచారం జరిగింది. జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగించి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్‌పీఆర్)కెమెరాలపై ఆధారపడాలని, ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

టోల్

మార్చి చివరి వారంలో రేట్ల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ నెల చివరి వారంలోపు ప్రతిపాదనలను పరిశీలిస్తుందని, తగిన పరిశీలన తర్వాత రేట్లను ఆమోదించవచ్చని హిందూస్థాన్ నివేదిక చెబుతోంది. కార్లు, తేలికపాటి వాహనాల టోల్‌ రేట్లు ఐదు శాతం పెరగనుండగా, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల ప్రారంభించిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, కొత్తగా ప్రారంభించిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే విభాగంలో కిలోమీటరుకు రూ.2.19 చొప్పున టోల్ వసూలు చేస్తున్నారు, దీనిని దాదాపు 10 శాతం పెంచనున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వేపై రోజుకు 20 వేల వాహనాలు తిరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఈ సంఖ్య 50 నుంచి 60 వేలకు పెరిగే అవకాశం ఉంది.