హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ & స్పితి జిల్లాలోని తిండి-కిలాడ్ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్టేట్ హైవే-26పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురవారం సాయంత్రం కొండచరియలు విరిగి పడగా, దాదాపు 53 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి రక్షించారు. విరిగి పడ్డ శిలల తొలగింపు పూర్తి కాకపోవడంలో స్టేట్ హైవే-26పై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లాల్లో 'లాహౌల్ & స్పితి' ఒకటి.
రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త: హిమాచల్ పోలీసుల
తిండికి 5 కిలోమీటర్ల దూరంలో పాంగి వైపు కొండచరియలు విరిగి పడినట్లు పోలీసులు తెలిపారు. 53 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సమాచారం అందగానే హుటాహుటిన బయలుదేరి సహాయక చర్యలు చేపట్టినట్లు తిండి పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లాహౌల్ స్పితి జిల్లాలో రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో తరుచూ కొండ చరియలు విరిగి పడుతుంటాయి.