నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం సమావేశం కాబోతోంది.
ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఈ సమావేశాల్లో పలు బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆ బిల్లులు, అలాగే ప్రత్యేక సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర కేబినెట్ చర్చంచనుంది.
పార్లమెంట్‌కు అనుబంధంగా ఉన్న భవనంలోనే ఈ సమావేశం జరగనుంది.
ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాను కేంద్రం ఇంకా పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. ఈ కెబినెట్ సమావేశం తర్వాత కేంద్రం ఎజెండాను పూర్తిస్థాయిలో వెల్లడించే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేబినెట్ మీటింగ్‌లో ప్రత్యేక సమావేశాల ఎజెండాపై చర్చించే అవకాశం
Breaking: PM Modi calls meeting of the Union Cabinet at 6:30 p.m today . pic.twitter.com/WfbvIfI5Po
— Breaking Now™® (@Breaking_Now1) September 18, 2023