Mobile numbers block: 1.4 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా!
ఆర్థికపరమైన మోసాల కేసులను నిరోధించడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. 1.4లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది. ఆయా నంబర్ల ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడటమే బ్లాక్ చేయడానికి ప్రధాన కారణం అని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో API(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్), ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(CFCFRMS) ప్లాట్‌ఫారమ్, నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్(NCCIP) సహకారంతో సహా పలు అంశాలపై చర్చించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సైబర్ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.
500 మంది అరెస్టు
సైబర్ నేరాల కేసుల్లో పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య సహకారం, సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఎన్‌సీఆర్‌పీని సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా టెలికాం డిపార్ట్‌మెంట్ 35 లక్షల యూనిట్ల బల్క్ ఎస్‌ఎంఎస్‌లను విశ్లేషించింది. ఇందులో 19,776 యూనిట్లు దురదృష్టకర సందేశాలను పంపినందుకు వాటిని బ్లాక్ చేశారు. అలాగే 500 మందికి పైగా అరెస్టు చేశారు. సుమారు 3.08 లక్షల సిమ్‌లను బ్లాక్ చేశారు. భారతదేశంలో డిజిటల్, మొబైల్ వాడకంతో ఆర్థిక మోసాల కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడంతో మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సులువుగా టార్గెట్ అవుతున్నారు.